Posts

Raadha (రాధ )

 ఎప్పటి లాగే ఆ రోజు, రఘు తెల్లవారే నిద్ర లేచి తన స్నేహితులతో వ్యాయామం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న పరంధామయ్య గారు, రారా రఘు నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వలా వ్యాయామం చెయ్యడానికి వెళ్ళావో లేదో ఒక అమ్మాయి  నీ కోసం మన ఇంటికి వచ్చింది. తన పేరు రాధ అని చెప్పింది. ఆ పేరు వినటం తోనే ఒక్కసారిగా రఘు మొహం అంత చెమటలతో నిండి పోయింది. రాధ ఎక్కడ ఉంది నాన్నా అని అడిగిన  తన కొడుకు  గొంతు లో ఏదో తెలియని తడబాటు పరంధామయ్య గారు గ్రహించలేక పోలేదు.  అదిగో అక్కడ వరండా లో కూర్చుని ఉంది అన్న పరంధామయ్య మాటలతో, రఘు చూపు ఒక్కసారిగా వరండా లో ఉన్న రాధ వైపు మల్లింది. రాధ, రెండు చిన్న జడలతో, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని అచ్చం అమ్మవారి లాగా ఉంది (అప్పటికి రాధ వయసు ఇంచుమించుగా పది సంవత్సరాలు ఉంటుంది).  రఘుని చూడగానే, రాధ కళ్ళలో ఒక రకమైన ఆనందం, వెంటనే రఘు వద్దకి వెళ్లి అయ్యగారు అని ఏడవటం మొదలు పెట్టింది.  రాధ ఏడవటం తో కంగుతున్న రఘు, ఏమైంది రాధ, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరన్నా ఎమన్నా అన్నారా, అయినా ఒక్క దానివే ఇక్కడికి ఎలా వచ్చావు, ఏడవకమ్మా, నేను ఉన్నాను కదా. ముందు వచ్చి ఇలా కూర్చో.